Modi-Trump: భారత్-యూఎస్ మధ్య చిగురించిన మైత్రి.. సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు
- భారత్-యూఎస్ మధ్య చిగురించిన మైత్రి
- 18 శాతం సుంకం తగ్గించిన ట్రంప్
- సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గతేడాది దెబ్బతిన్న సంబంధాలు కొత్త ఏడాదిలో చిగురుస్తున్నాయి. గత సంవత్సరంలో సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా ట్రంప్-మోడీ ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి బలపడ్డాయి. సోమవారం ఇద్దరి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌పై 18 శాతం సుంకం తగ్గించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని.. ఇక భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోడీ గొప్ప స్నేహితుడు అంటూ కొనియాడారు. ఈ మేరకు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌పై ఉన్న ట్రంప్-మోడీ ఫొటోను పోస్ట్ చేశారు.

Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోడీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గించబడిందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పని చేసినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ మోడీ రాసుకొచ్చారు.

Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
When two large economies and the…
— Narendra Modi (@narendramodi) February 2, 2026

తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!