PM Modi: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్.. మోడీకి ఎంపీల సన్మానం
- భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్
- ప్రధాని మోడీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం
- పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం రాత్రి ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. అనంతరం భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించినట్లైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌కు కూడా మంచి ఊపునిచ్చింది. భారీ స్థాయిలో లాభాల్లో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఇక భారత్-యూఎస్ డీల్ కుదరడంతో మంగళవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలంతా ఘనంగా సన్మానించారు. మోడీ మెడలో పూలదండ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
వాణిజ్య ఒప్పందం భారతదేశ ఆర్థిక బలం, దౌత్య నైపుణ్యం, ప్రపంచ ప్రభావానికి నిదర్శనమని మోడీ అన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘దేశంలో తయారీని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ప్రస్తుత కాలంలో అతిపెద్ద డిమాండ్. దేశం ఇప్పుడు ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ నాణ్యతను ప్రపంచానికి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు
ఇక ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి బడ్జెట్ విజయాలు, ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని మోడీ ఆదేశించారు. బడ్జెట్ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వారి జీవితాలకు.. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ చర్యల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొ్న్నారు. ఇక పార్లమెంటులో క్రమశిక్షణ, చురుకైన హాజరు ఉండాలని సూచించారు. ఎంపీలందరూ ప్రతిరోజూ సభలో హాజరు కావాలని.. చర్చలలో పూర్తిగా పాల్గొనాలని కోరారు. శాసన ప్రక్రియను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ఎంపీల బాధ్యత కూడా అని పేర్కొన్నారు.
- Tags
- india
- NDA MPs
- PM Modi
- US trade deal
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..