Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Modi Secures Mega Trade Deals With Us And Eu Amid Global Tariff Tensions

PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!

Published Date :February 3, 2026 , 7:27 pm
By Kothuru Ram Kumar
PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కటే టెన్షన్.. ట్రంప్ కు ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు టారిఫ్లు బాధుతారన్న భయం. ట్రంప్ చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అన్ని దేశాలు వణకిపోతున్నాయి. ఒకవైపు అగ్రరాజ్యాల అంక్షలు, మరోవైపు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిచ్చితి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ మాత్రం తన దౌత్య వ్యూహాన్ని ప్రదర్శించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్, యూనియన్ ఇటు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న రెండు మెగా ట్రేడ్ డీల్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రపంచం మొత్తం టారిఫ్లతో ఇబ్బంది పడుతుంటే ప్రధాని మోడీ తన వ్యూహాత్మక చతురతతో భారత్ కు బిలియన్ డాలర్ల లాభాన్ని చేకూర్చారు. సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడే సంయమనంతో వ్యవహరించాలి. అలా ఉంటేనే పరిస్థితులు ఎవరికైనా అనుకూలంగా మారుతాయి. భారత్ పై 100 శాతం వరకు టారిఫ్ లు వేస్తానని ట్రంప్ ప్రకటించగానే చాలా మంది వణకిపోయారు. ఇంకేముంది మన దేశం ఆర్థికంగా కుదేలైపోతుందని గగ్గోలు పెట్టారు. ట్రంప్ ను ఎదిరించలేకపోతున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైందో మీకు తెలుసుగా వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికాతో రెండు భారీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని మోదీ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది.

GITAM University: గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ

అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలుపోతుంటే భారత్ మాత్రం తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కేవలం ఏడు రోజుల్లోనే కుదిరిన ఈ రెండు ఒప్పందాల ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత్ కు సుమారు 150 బిలియన్ డాలర్ల ఎగుమతుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు ప్రపంచ దేశాల మధ్య చిక్కుకోకుండా భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను ఎలా కాపాడుకోగలదో నిరూపించిన సందర్భం.

మన ఫార్మా, స్టీల్, టెక్స్టైల్ రంగాలకు ఊపిరి పోస్తూ.. చైనా, వియత్నాం వంటి దేశాలకు చెక్ పెడుతూ భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాల వెనుక ఉన్నది ఏంటో తెలుసా? మోడీ మార్కెట్ ట్రేడ్ డిప్లమసీ. ముందుగా అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని గమనిస్తే.. ఇది భారత ఎగుమతిదారులకు ఒక తీపికబురు. గతంలో రష్యా నుంచి చమరు కొనుగోలు చేసినందుకు గాను ట్రంప్ ప్రభుత్వం భారత్పై 25% పెనాల్టీతో కలిపి మొత్తం 50% భారీ టారిఫ్ ను విధించింది. దీనివల్ల మన ఉక్కు, టెక్స్టైల్స్ ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రధాని మోదీ తన వ్యక్తిగత చొరవతో ట్రంప్ తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించి ఈ పెనాల్టీని పూర్తిగా ఎత్తివేసేలా చేశారు.

Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..

ఇప్పుడు భారత వస్తువులపై టారిఫ్ కేవలం 18%. దీనివల్ల కలిగే లాభాలు అక్షరాల కోట్లలోనే. స్టీల్ రంగాన్ని చూసుకుంటే అమెరికాకు ఎగుమతులు 40% పడిపోయిన సందర్భంలో ఈ ఒప్పందంతో కనీసం 2 బిలియన్ డాలర్ల ఆదాయం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద జెనరిక్ ఔషధాల ఎగుమతిదారు అయిన భారత్ కు ఈ ట్రేడ్ డీల్ పెద్ద వరం. 26% ఉన్న టారిఫ్ తగ్గడం వల్ల సుమారు 10 బిలియన్ డాలర్ల అదనపు యుగమతులు ఫార్మా రంగం ద్వారా సాధ్యమవుతాయి. ఇక 60% సుంకాలతో కుదేలైన సముద్ర ఉత్పత్తుల రంగం కూడా ఈ ఒప్పందంతో తిరిగి ఊపిరి పోసుకోబోతుంది. ఇదంతా మోదీ ప్రభుత్వం అనుసరించిన నేషన్ ఫస్ట్ పాలసీ వల్లనే సాధ్యమైంది.

ఇక రెండో విజయం యూరోపియన్ యూనియన్ తో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సుమారు రెండు దశాబ్దాలుగా నలుగుతున్న ఈ చర్చలను మోదీ ప్రభుత్వం ఒక కొలిక్కి తెచ్చింది. భారత్ తన 77వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మరుసటి రోజే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడం విశేషం. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏంటంటే.. జీరో టాక్స్. అవును భారత్ నుంచి యూరోప్ కు వెళ్ళే 99.5% వస్తువులపై బ్రెసల్స్ 0% పన్ను విధించనుంది. ముఖ్యంగా లెదర్ వస్తువులు, జ్యువలరీ రంగానికి ఇది అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. దీనివల్ల 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 272 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచన. భారత్ కూడా యూరోపియన్ కార్లపై ఉన్న 110% టారిఫ్ ను ఐదేళ్లలో 10%నికి తగ్గించేలా అంగీకరించింది.

Student S*uicide Case: విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పలువురు అరెస్ట్!

దీనివల్ల భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడమే కాకుండా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. అంతేకాకుండా గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ భారత్ కు 500 మిలియన్ యూరోల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. ఈ రెండు ఒప్పందాలు భారత్ ను ప్రపంచ వాణిజ్య పటంపై అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకవైపు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుంటే భారత్ మాత్రం ఇరువైపులా ప్రయోజనం పొందేలా వ్యూహం రచించింది. బంగ్లాదేశ్ వియత్నాం వంటి దేశాల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేలా మన టెక్స్టైల్ రంగానికి ఈ ఒప్పందాలు ఊపిరిపోయినున్నాయి. విపక్షాలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మన ఉత్పత్తిదారులు రైతులు వ్యాపారవేత్తలు ఈ ట్రేడ్ డీల్స్ ను స్వాగతిస్తున్నారు.

మొత్తానికి వారం వ్యవధిలో కుదిరిన ఈ రెండు మెగా డీల్స్ భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల దిశగా పరుగులు తీయించబోతున్నాయి. వరల్డ్ ఆర్డర్ మొత్తం మారుతున్న సందర్భంలో భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు.. ఒక గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్ అని మోడీ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అమెరికా యూరోప్ విధుల్లో మరింత ఎక్కువగా కనిపించబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Global Tariff War
  • india economic growth
  • India EU free trade agreement
  • India Export Growth
  • India Global Trade News

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions