రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్‌రత్నగా ఉన్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు పేర్కొన్నారు ప్రధాని మోడీ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ఖేల్ రత్న…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…
నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పారదర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా నగదును…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
పార్లమెంట్ సమావేశాలకు ముందు పెగాసస్ అంశం దేశాన్ని అతలాకుతలం చేసింది. పెగాసస్ స్పేవేర్‌తో దేశంలోని ప్రముఖులపై కేంద్రం నిఘా ఉంచిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. పెగాసస్ అంశం చర్చకు తీసుకురాకుండా మిగతా అంశాలను చర్చించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ కానీ, అందుకు ప్రతిపక్షాలు…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపికయ్యాక మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడితో సహా అనేక మంది నేతలతో దీదీ భేటీ కాబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు తదితర విషయాలపై ఆమె ప్రధానితో చర్చించారు. ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్నది. దీనిపై పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చర్చ…
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…