స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ‘క్లీన్ ఏపీ’లో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. అయితే ఆ వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై వీర్రాజు మండిపడ్డారు. సోము వీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చింది. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ.…
కరోనా సమయంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి పెద్ద పీఠ వేసేదిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా స్వయం సమృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని మోడి పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లోని…
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి…
ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.. ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు. అయితే,…
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. అయితే, భారత్ బంద్ ఫెయిల్ అయ్యిందని.. రైతులంతా ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉన్నారని తెలిపారు.. బీజేపీ ఎంపీ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.. విపక్షాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ ఫెయిల్ అయ్యింది.. ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదన్న ఆయన.. రైతు ముసుగులో కాంగ్రెస్, విపక్షాలు…
ఇవాళ జరిగిన భారత్ బంద్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…
భారత్ బంద్ లో పాల్గొన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ మరియు సీఎం కేసీఆర్ లపై నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్, మోడీ వేరు వేరు కాదని… ఒకే నాణెం కు ఉన్న బొమ్మ, బొరుసు లాంటి వాళ్ళని ఫైర్ అయ్యారు. దేశాన్ని మోడీ, అమిత్ షా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని…మన భూమి లో మనమే కూలీలు గా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. అప్పట్లో భారత్ బంద్ కి కెసిఆర్ మద్దతు…
అమెరికా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ప్రధాని సందర్శించడంతో ఇంజనీర్లు షాకయ్యారు. దాదాపు గంటసేపు ప్రధాని మోడీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలపడి గులాబ్ తుఫాన్‌గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాటబోతున్నది. తీరం దాటే సమయంలో భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇక ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి తీరప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు.…
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది.…