ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్…
మోదీ సర్కారుకు ప్రజా వ్యతిరేకత తెలిసి వస్తోందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శంగా కన్పిస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లోని సీఎంలను సైతం బీజేపీ హఠాత్తుగా మార్చేస్తుండటంతో ఆపార్టీకి సెగ భారీగానే తాకుతోందని అర్థమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ-షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు…
బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. గతంలో.. పద్ధతి.. పద్ధతి.. అని చెప్పినట్టుగా కాకుండా.. ఇక తేడా వస్తే.. తోక కట్ చేయడమే.. అన్నట్టుగా నిర్ణయాలు అమలు చేస్తోంది. కొంత కాలంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు సైతం ఈ కోవకే చెందుతుంది. పార్టీ లైన్ కు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. శ్రేణులను సమర్థంగా నడిపించలేకపోతున్నా.. అధిష్టానం ఏ మాత్రం కనికరించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా.. పార్టీ…
ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో జరుగనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ సర్కారు అధికారంలో ఉంది. దీనిని తిరిగి నిలబెట్టుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ పీఠం మరోసారి కమలదళం చేతిలోకి వెళ్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.…
ప్రధాని మోడి ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్రీడకలకు అంగవైకల్యం అడ్డుకాదని, దీనికి ఉదాహరణ పతకాలు సాధించిన క్రీడాకారులే అని ప్రధాని మోడీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని ప్రధాని పలకరించారు. ప్రధానిని కలిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. Read: తాలిబన్ల విజయం వారికి మరింత బలాన్నిస్తుందా…?
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ రూపానిని రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆదేశించడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. గతంలో, 2016 లో కూడా, 16 నెలలు ముందుగా ముఖ్యమంత్రి గా ఆనందిబెన్ పటేల్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది అధికార బీజేపీ అగ్రనాయకత్వం. గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న, శక్తివంతమైన పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుత నిర్ణయానికి ప్రధాన కారణం…
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ…
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కరోనా, తీవ్రవాదంపై ప్రధాని ప్రసంగించడంతోపాటు ఆప్ఘనిస్థాన్‌పై భారత వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం గురించి చర్చించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌తో మోడీ భేటీ అవుతారని సమాచారం. కరోనా కారణంగా విదేశీ పర్యటనలకు దూరమయ్యారు మోడీ.. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈ సమావేశం నిర్వహించారు. కాగా, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని మోడీ ఆదేశించారు.. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న.. మోడీ మరోసారి అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఇంకా పూర్తిగా సెకండ్ వేవ్ కూడా ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న…
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి…