17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుదలయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ.…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…
ఇన్నాళ్లు దేశంలో మోడీకి ఎదురేలేదు. కానీ కరోనా వచ్చాక పరిస్థితులు మారాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలైనా.. మోడీ పక్షాన్ని మాత్రం కరోనా చావుదెబ్బ తీసింది. కరోనా టైంలో ప్రజలను ఆదుకునే విషయంలో.. ప్యాకేజీలు ప్రకటించడంలో మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.. కవర్ చేయడానికి మోడీ సార్ పెంచిన ధరాఘాతంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈక్రమంలోనే ఎన్నడూ లేనంతగా మోడీ పాలనపై దేశ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ…
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు పూర్తిగా సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతవారం కూడా భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ సందర్భంలోనూ మోడీ సమీక్ష నిర్వహించారు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన…
బాదితే.. అలా ఇలా కాదు.. జకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు ఉండాలి అన్నట్లుగా మోదీ సర్కారు తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ దానికి దేశభక్తి అనే ట్యాగ్ తగిలించడం బీజేపీకే సర్కారుకే చెల్లించిందని కాంగ్రెస్ వాదులు విమర్శిస్తున్నారు.. ప్రభుత్వాలు అప్పులు చేసినప్పుడు తిరిగి చెల్లించక తప్పదు. అలా చెల్లించే క్రమంలో ప్రజలపై ఏ రేంజులో బాదుతామో మోదీ సర్కారు అందరికీ అర్థమయ్యేలా…
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ట్రైబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునల్స్‌ను మూసి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు…
బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణ పేరిట మరింత దూకుడు పెంచింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. జనధన్ ఖాతాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక రెండోసారి పొత్తుల ఎత్తులతో సంబంధం లేకుండానే బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో మోదీ సర్కారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది. అయితే మోదీ సర్కారు దూకుడు…
ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…