ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే…
ఆరోగ్యకర భారతం కలలు సాకారం చేయాలనే తపనతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని.. భారత్‌లో ఆరోగ్యం, అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే సంప్రదాయం గతంలో లేకపోయినా.. ఇప్పుడు ఆ పని విజయవంతంగా ప్రధాని మోడీ చేస్తున్నారని.. మంచి ఫలితాలను సైతం సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ.. ఢిల్లీలో ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్దేశ ఆరోగ్య బడ్జెట్…
అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం…
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే…
సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది.. పెట్రో ధరలతో పాటు క్రంగా గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్ ధరలను చెల్లించేందుకు…
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం కమలా హ్యారీస్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అమెరికా, భారత్ మధ్య సహకారం, సమన్వయం మరింత బలపడ్డాయన్నారు పీఎం.…
ఇటీవలే ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత జరిగే BAC సమావేశంలో అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… కేసీఆర్, మోడీ సర్కార్ లపై నిప్పులు చెరిగారు. ఇవాళ అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలేనని… పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెరిగాయని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ఆస్తులు అమ్ముతున్నారని… నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమన్నారు. మోదీ జాతి సంపదను ఆధాని, అంబానీలకు అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ఆధాని,…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ-అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సమావేశంపై అధికారికంగా ప్రకటన చేసింది వైట్ హౌస్.. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వెల్లడించింది.. కాగా, ప్రధాని మోడీ.. ఈ వారమే అమెరికా వెళ్లనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ.. అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి.. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు.…