ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్‌లకు చిన్న ఇన్వెస్టర్లకు డైరెక్ట్ యాక్సిస్ ఉంటుందని వెల్లడించిన మోడీ.. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం బలమైన బ్యాకింగ్ వ్యవస్థ అవసరం అన్నారు.. సులభతరమైన పెట్టుబడులతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం కూడా చాలా కీలకమైన విషయంగా తెలిపిన ఆయన.. గడిచిన ఏడేళ్లలో ఎన్పీఏలను చాలా పారదర్శకంగా చూశామని, తీర్మానాలు.. రికవరీలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
Read Also: సీఎస్, డిస్కంలు, ఇంధన శాఖకు ఏపీ ఈఆర్సీ లేఖ
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో బ్యాంకింగ్ రంగం అందించిన సేవలను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్బీఐతో పాటు వివిధ ఆర్థిక సంస్థలను కూడా ప్రశంసించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌తో, చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలలో సురక్షితంగా పెట్టుబడి పెట్టగల మాధ్యమాన్ని కలిగి ఉన్నారన్న ఆయన.. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం దేశంలో ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్ వ్యవస్థ’ రూపుదిద్దుకోవడానికి దోహదం చేస్తుందన్నారు.. 2014 నుండి తన ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలపై మాట్లాడిన ప్రధాని మోడీ.. తాను మొదటిసారి ప్రధాని అయినప్పుడు.. ఆర్థిక పునరుద్ధరణ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత ఏడేళ్లలో, నిరర్థక ఆస్తులను పారదర్శకతతో గుర్తించడంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు రీక్యాపిటలైజ్ చేయబడ్డాయి. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. దేశ అవసరాలు, పౌరుల అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందే ఉంటామన్నారు. మనం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిరంతరం బలోపేతం చేయాలి.. సున్నిత మరియు పెట్టుబడిదారుల-స్నేహపూర్వక గమ్యస్థానంగా భారతదేశం యొక్క కొత్త గుర్తింపును ఆర్బీఐ బలోపేతం చేయడం కొనసాగిస్తుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉందని వ్యాఖ్యానించారు.