క్రిప్టో కరెన్సీ… ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. ఎవరి అజమాయిషిలో లేని విధంగా డి సెంట్రలైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఈ క్రిప్టోకరెన్నీ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి అజమాయిషి ఉండనప్పటికీ అరాచక శక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తె దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా యువత తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన దేశాలు క్రిప్టో కరెన్సీపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ది సిడ్నీ డైలాగ్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.
Read: అందంగా ఉన్నాయి… బొమ్మల్లా ఉన్నాయని దగ్గరకెళ్లారో… ఇక అంతే…
ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. సాంకేతికత, డేటా కొత్త ఆయుధాలుగా మారుతున్న ఈతరుణంలో ప్రతి ఒక్కటి డిజిటల్‌గా మారిపోతున్నదని, డిజిటల్ రంగంలో అంతర్జాతీయంగా పోటీ నెలకొన్నదని, అదేవిధంగా కొత్త టెక్నాలజీ ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతుందని ప్రధాని మోడి తెలిపారు. క్రిప్టోకరెన్సీ అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశాలపై ఉందని ప్రధాని పేర్కొన్నారు.