ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారణాసిలోని కలాభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు ప్రధాని మోడీ.. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇక, అక్కడి నుంచి నేరుగా కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు ప్రారంభించనున్నారు భారత ప్రధాని.. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు.…
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో…
తమిళనాడులోని సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు త్రివిధ దళాలు నివాళులు ఆర్పించనున్నాయి. 8:33 గంటలకు ఎయిర్ చీఫ్ మార్షల్ నివాళులు ఆర్పిస్తారు. ఆ తరువాత 8:36 గంటలకు ఆర్మీ అధికారులు, 8:39 గంటలకు నేవీ అధికారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం 8:45…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్…
భారత్- రష్యా మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు కలిసి నడుస్తున్నాయి. అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు రష్యా అండదండలు ఎనలేనివి. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో భారత్ తటస్థ వైకరి అవలంభించినప్పటికీ సోవియట్ యూనియన్‌తో సన్నిహితంగా ఉంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో పాటే ఏకదృవ ప్రంపంచం…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంటూ దేశ రాజధాని శివార్లలో రైతు సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.. కేంద్రం ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకున్నా.. మరికొన్ని డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చలి, ఎండ, వాన ఇలా ఏదీ లెక్కచేయకుండా ఆందోళన చేసిన రైతులు చాలా మంది వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కన్నుమూశారు.. అయితే, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర వ్యవసాయ…
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది..…
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. అదే…