నిన్న టీఆర్ఎస్ భవన్ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్. 40 లక్షల…
వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలిపినవారు కూడా ఉన్నారు.. తాజాగా, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భగవత్ కరాడ్.. తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు..…
1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు.…
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్‌కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…
ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించబోతున్నారు. భారత్ వాయుసేనకు చెందిన సీ 130 జె సూపర్ హెర్క్యులస్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగనున్నారు. అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు. 340 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిపై అక్కడక్కడా వాయుసేన విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే లను నిర్మించారు. Read: నవంబర్ 16, మంగళవారం దినఫలాలు… ఆదివారం రోజున…
ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్లో పెట్టుబడి…
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కంగనా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామూలుగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, బ్రిటీష్ వారు భిక్ష వేశారని, మనకు 2014లోనే మోదీ అధికారంలోకి వచ్చాక అసలైన స్వతంత్రం లభించిందని వ్యాఖ్యానించింది. 1947లో మనకు వచ్చింది స్వతంత్రం కాదని… భిక్ష అంటూ ఓ…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ల్యాడ్స్‌ను పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయనుంది మోడీ సర్కార్. తమ నిజయోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పార్లమెంట్ సభ్యులకు అవకాశం రాబోతోంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ – ఎంపీ ల్యాడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడమే దీనికి కారణం. కరోనా కారణంగా ఎంపీ ల్యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితులు చక్కబడుతుండడంతో… ఎంపీ…
మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి.. బిల్లులకు పార్లమెంట్లో సహాయం కోరినప్పుడు కేసీఆర్ దేశద్రోహికాడు..! రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని వ్యాఖ్యానించారు…
ఏడేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం ఒరిగింది..? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? అంటూ నిలదీశారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు 2014లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉంటే.. దేశంలో పెట్రోలు రూ.77, డీజిల్ ధర రూ.68కి లభించింది.. ఇప్పుడు క్రూడాయిల్ ధర 83 ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.115, డీజిల్ ధర రూ.107గా ఉందని గుర్తుచేశారు.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల…