దాదాపు ఏడాది కాలంగా ప్రజలు నిరసన వ్యక్తం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి మోడీ నిన్న ప్రకటించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగబద్ధంగా రద్దు ప్రక్రియను పూర్తి చేయనుంది. మోడీ తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కంగనా మాత్రం మోడీ తీసుకున్న…
దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్టాన్ని ఏనాడూ వదలలేదు.. ఈ రోజు నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తాను.…
కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరం కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తిరుచానూరులో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు… ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని, ఇది కేంద్రంపై రైతులు సాధించిన విజయమని అన్నారు.…
రైతు చట్టాలు రద్దు చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్ పేర్కొన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారు… పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్. అన్నదాతలు…
కొత్త సాగుచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలు రద్దు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రప్రభుత్వం అహంకారాన్ని రైతుల సత్యాగ్రహం ఓడించిందని ట్వీట్ చేశారు. రైతు చట్టాలు తీసుకురావడమే తప్పని, రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అనేకమంది అన్నదాతలు ప్రాణాలు…
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. “ఈరోజు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి. ఈరోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్లోని మహోబాలో నీటిపారుదలకి సంబంధించిన కీలక పథకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’ కోసం ఝాన్సీకి వెళతారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముందు ఆయన ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని పీఎంవో ట్వీట్ చేసింది. కోవిడ్ వ్యాప్తి…
తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఇవాళ ఇందిరా పార్క్ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
క్రిప్టో కరెన్సీ… ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. ఎవరి అజమాయిషిలో లేని విధంగా డి సెంట్రలైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఈ క్రిప్టోకరెన్నీ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి అజమాయిషి ఉండనప్పటికీ అరాచక శక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తె దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా యువత తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన దేశాలు క్రిప్టో కరెన్సీపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని…
కాంట్రావర్సీ క్వీన్ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ అన్నారు. కంగనా రనౌత్ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి…