విశాఖ ఉక్కు లాగే… సింగరేణిపై కుట్ర.. తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే ప్రయత్నం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాగే.. సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్… సింగరేణి కార్మికులు సమ్మె చేసినా ప్రైవేట్ పరం చేసే కుట్ర మోడీ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఈ పరిణామాలన్నీ తెలంగాణపై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాదన్నారు.. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా… నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. విశాఖ ఉక్కు లాగానే… సింగరేణి నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు.
Read Also: కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడువు.. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదా..?
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బాల్క సుమన్.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా.. మొండి వైఖరితో బీజేపీ ఉందని దుయ్యబట్టిన ఆయన.. గుజరాత్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణకి ఇంకో నీతా అని ప్రశ్నించారు.. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి… తెలంగాణకు సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.. ఇదంతా తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే కుట్ర అని పేర్కొన్న ఆయన.. మోడీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఇక, బీజేపీ నేతలను నిలదీయడంతో కేంద్రానికి సెగ తగిలేలా చేయాలని సూచించారు బాల్క సుమన్.
- Tags
- Balka Suman
- bjp
- cm kcr
- PM Modi
- Singareni
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!