సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్… సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారంగా తెలిపిన ఆయన.. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్న ఆయన.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుంది.. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు.
Read Also: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ ప్రత్యేక దృష్టి
సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు కేటీఆర్.. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్‌గా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.. సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదు.. గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు.. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని పోతాయని.. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.. సింగరేణి కాపాడుకునేందుకు మేం అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.