బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయన్న ఆయన.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేదన్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2022 చివరి నాటికి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని వెల్లడించిన మంత్రి కొప్పుల.. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లలో దళితులు ఊచకోతకి గురయ్యారని విమర్శించారు..
Read Also: రేపు పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన సర్కార్..
బీజేపీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. సచివాలయం గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు… పార్లమెంట్ భవనం ఎందుకు కడుతున్నారు? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగంపై రాద్ధాంతం చేస్తున్నారని.. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు మంత్రి కొప్పుల.