తెలంగాణ కేబినేట్ భేటిలో వరి ధాన్యం అంశంపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంప్రభుత్వం రాష్ర్ట బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో రెండేళ్లలో భయంకరంగా పేదరికం పెరిగింది. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారద్రోలాలని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బోర్ల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది.…
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక తాజాగా ఎయిర్ పోర్టుల్లో కొత్త వేరియంట్ పై కేంద్రం గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తే… టెస్టింగ్ తప్పని సరి అని కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా… ఎయిర్ పోర్ట్ లో టెస్టింగ్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఎయిర్ పోర్ట్…
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. Read: 63శాతం పెరిగిన టమోటా ధరలు… ధరల స్థిరీకరణకు……
ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్లో…
భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారు. రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి ఆదుకోవాలని లేఖలో కోరారు సీఎం జగన్. ప్రాధమిక నష్ట అంచనాల నివేదికను అందులో పొందుపర్చారు ముఖ్యమంత్రి. మధ్యంతర సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అత్యవసరంగా సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అలాగే నష్ట పరిహార అంచనాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించండి అని లేఖలో…
గత శుక్రవారం… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు అంటే… (నవంబర్ 29న) “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు… కేంద్ర…
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని…