కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయం, కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు.. ఇదే, సమయంలో ఆయన రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి.. అయితే, బీజేపీ ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం అని ప్రకటించారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.. కానీ, రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ అనడం మాత్రం సరికాదన్నారు తమ్మినేని వీరభద్రం..
Read Also: ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారు-సజ్జల
మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చటానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు తమ్మినేని.. రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తుందని మండిపడ్డ ఆయన.. రాష్ట్రల హక్కులను పరిరక్షించాలని అని కేసీఆర్ సవరించుకోవాలని సూచించారు.. రాజ్యాంగన్నీ రక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి అనేదే సీఎం నినాదంగా తెలిపిన ఆయన.. ఇక, పోడు భూముల సమస్యలపై ఉద్యమన్నీ తీవ్రతరం చేస్తాం, పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పోడుభూముల బాధితులను త్వరలో పరామర్శిస్తామని వెల్లడించారు తమ్మినేని వీరభద్రం.