ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్లో…
భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారు. రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి ఆదుకోవాలని లేఖలో కోరారు సీఎం జగన్. ప్రాధమిక నష్ట అంచనాల నివేదికను అందులో పొందుపర్చారు ముఖ్యమంత్రి. మధ్యంతర సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అత్యవసరంగా సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అలాగే నష్ట పరిహార అంచనాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించండి అని లేఖలో…
గత శుక్రవారం… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు అంటే… (నవంబర్ 29న) “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు… కేంద్ర…
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని…
ఢిల్లీ సింఘు సరిహద్దులో “సంయుక్త కిసాన్ మోర్చా” నేతల సమావేశం ముగిసింది. రైతు ఆందోళనలో భాగంగా ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది “సంయుక్త కిసాన్ మోర్చా.” రేపు లక్నోలో “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమం వుంటుంది. నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో సభలు, సమావేశాలు, అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తారు. నవంబర్ 29న “పార్లమెంట్ మార్చ్” కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యచరణ కోసం నవంబర్ 27న మరో సారి సమావేశం కావాలని నిర్ణయించింది…
కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని… మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందని… భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు. రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందని…. బడా పారిశ్రామిక…
రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారు. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని అన్నారు. మోడీ ఎన్ని…
రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు. ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి.…
రైతు ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో ముందున్న వ్యక్తి. ఆయనే రాకేష్ టికాయత్. ఇకపైన రైతుల సమస్యల పోరాటం కొనసాగుతుందని.. విశ్రమించ బోమంటున్నా రాయన. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే అందరికి గుర్తుకొచ్చే పేరు రాకేష్ టికాయత్. భారత కిసాన్ యూనియన్ నేత. రైతులకు శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అన్నదాతలు నడిపిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా…