రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు.
పశ్చిమబెంగాల్‌లో గవర్నర్‌ను సీఎం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చిందని, సీఎంకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య అగాధాన్ని తెచ్చారని ఆయన మండిపడ్డారు. అమ్మాయిలు చదువుకోడానికి వెళ్తే కర్ణాటకలో బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ఇదేనా మీరు కోరుకున్న భారతదేశం కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల మనసులో మతం పేరుతో విషం నింపుతున్నారని ఆయన అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి చలికాచుకోవాలనేదే బీజేపీ ప్రయత్నం ఆయన ధ్వజమెత్తారు.