దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది… గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఇక, ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడావేసినట్టుగా చెబుతున్నారు.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ…
పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బైక్‌ని తప్పించబోయి.. వంతెన రెయిలింగ్‌ను ఢీకొంది బస్సు.ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాదంపై సీఎం జగన్,…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్‌ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులను ఓ కారు ఢీ కొట్టింది. ఆ ఘటనలో కొంత మంది రైతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపింది హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకేనంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపి ఆ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని వెల్లడించింది.…
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్‌వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక,…
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారణాసిలోని కలాభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు ప్రధాని మోడీ.. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇక, అక్కడి నుంచి నేరుగా కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు ప్రారంభించనున్నారు భారత ప్రధాని.. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు.…
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో…
తమిళనాడులోని సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు త్రివిధ దళాలు నివాళులు ఆర్పించనున్నాయి. 8:33 గంటలకు ఎయిర్ చీఫ్ మార్షల్ నివాళులు ఆర్పిస్తారు. ఆ తరువాత 8:36 గంటలకు ఆర్మీ అధికారులు, 8:39 గంటలకు నేవీ అధికారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం 8:45…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్…