తెలంగాణ వచ్చి ఇప్పటికి 8 ఏళ్లయింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదా అని ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. దీనికి కారణం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. దీనికీ దానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. 18 ఏళ్ల కిందట కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. అప్పుడేమో…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా..నేనా..అన్న రీతిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం హైదరాబాద్ లో జరుగుతుండటం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆపరేషన్ తెలంగాణలో భాగంగానే బీజేపీ తన అత్యున్నత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక…
వరుసగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ.. ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజుల పాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ నాయకులు అందరూ హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు అందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీలో నిలిచిన…