Pawan Kalyan: ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. నేతాజీ అస్థికలు కూడా తెప్పించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య పథ్ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయం.. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది.. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచేయడం సంతోషించాల్సిన విషయం అన్నారు.. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో వలస వాద పాలనలో ఉద్భవించిన పేర్లు మరియు చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయమన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జపాన్ లో భద్రపరచిన నేతాజీ అస్థికలను కూడా రప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డీఎన్‌ఏతో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని.. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందన్నారు పవన్ కల్యాణ్.
Read Also!: Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయి..
Also Read
- RTI Case: 1000 ఆర్టీఐ దరఖాస్తులు, 300లకు పైగా సెకండ్ అప్పీళ్లు.. ఏపీ సమాచార కమిషన్ సంచలన ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ పరిసరాల్లో ఇన్నాళ్లు రాజ్‌పథ్‌గా కొనసాగిన చారిత్రక నిర్మాణం.. కర్తవ్య పథ్‌గా మారిన విషయం తెలిసిందే.. రాజ్‌పథ్‌కు మరిన్ని అధునాతన సౌకర్యాలను చేరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దింది.. అంతేకాకుండా కర్తవ్య పథ్‌లోనే 25 అడుగుల ఎత్తైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురువారం నేతాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
RTI Case: 1000 ఆర్టీఐ దరఖాస్తులు, 300లకు పైగా సెకండ్ అప్పీళ్లు.. ఏపీ సమాచార కమిషన్ సంచలన ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?