తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీజేపీని, ప్రధానమంత్రిని దూషిస్తూ ఉపయోగిస్తున్న భాషపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల బీహార్ పర్యటనలోనూ ప్రధాన మంత్రిని సంబోధించడంలో కేసీఆర్ కనీస పరిణతిని కూడా ప్రదర్శించలేదు. ‘‘బిజెపి ముక్త్ భారత్’’ అన్న కేసీఆర్ పిలుపు హాస్యాస్పదంగా ఉంది. సూర్యుడిపై ఉమ్మేస్తే, అది తన ముఖంపైనే పడుతుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్.
వాస్తవానికి కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయి. ఆయనలో నిరాశ, నిస్పృహలు పతాక స్థాయికి చేరుకున్నాయి కనుకనే ముక్త్.. ముక్త్ అంటూ పిచ్చికూతలు కూస్తున్నాడు. బీజేపీపై కేసీఆర్ కు ఎందుకంత కోపం? రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచ నాయకుడిగా మన్ననలు పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ఆయనకున్న శత్రుత్వానికి కారణమేంటి? లాక్ డౌన్ సమయంలో, మహమ్మారి అనంతర కాలంలో ఉచిత రేషన్ ఇచ్చి, 80 కోట్ల మంది ప్రజలను ఆదుకున్నందుకా? ప్రజలకు 211 కోట్లకు పైగా ఉచిత వ్యాక్సిన్‌లను అందించినందుకా?
పేద మహిళలకు 12 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, వారికి పొగ రహిత జీవనం కల్పించినందుకా? దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినందుకా? ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించినందుకా? ఇళ్లు లేని పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లు కట్టించినందుకా? పేదలకు లభిస్తున్న ఈ ప్రయోజనాలను దూరం చేసేందుకే కేసీఆర్ ‘‘బిజెపి ముక్త్ భారత్’’ అంటున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే కేసీఆర్ కు ఎందుకు ఈ ఆలోచన వస్తుంది? అని ప్రశ్నించారు తరుణ్ చుగ్.
Read Also: Pawan Kalyan: పోలీసులు ధర్మంగా పనిచేయాలి.. తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతా..!!
సంక్షేమం, అభివృద్ధి మధ్య చక్కటి సమతుల్యతను నెలకొల్పుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ఆత్మ నిర్భర్ భారత్‌గా, విశ్వ గురువుగా మార్చే దిశగా నడిపిస్తున్నారు. దేశం ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’గా మారడం కేసీఆర్‌కు ఇష్టం లేన్నట్టుంది.రాజకీయంలో చివరి దశకు చేరుకున్న కేసీఆర్ బిజెపిపై, గౌరవ ప్రధానిపై జుగుప్సాకరమైన ప్రకటనలు చేయడం మానుకోవాలి. టీఆర్ఎస్ నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు తరుణ్ చుగ్.