ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఎవరు? మళ్లీ ప్రధాని అయ్యేది ఎవరు? అంటూ ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒపీనియన్ పోల్ నిర్వహించింది… ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.. ఉన్నట్టుండి ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు…
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ (బీబీఎన్ఎల్) మరియు బీఎస్ఎన్ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ విలీనంతో, బీఎస్ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ఉపయోగించి 5.67 లక్షల కిలోమీటర్ల…
World Record Doctor: సుషోవన్ బంద్యోపాధ్యాయ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఫేమస్ డాక్టర్. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ కాలం ఒక్క రూపాయికే వైద్యం అందించిన అరుదైన డాక్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ మంది రోగులకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.
PM Modi: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఒక వైపు వరుణ దేవుడు, మరో వైపు వరుణ్‌గాంధీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ లేటెస్టుగా ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే పైన ఐదు రోజులకే పెద్ద గండిపడింది.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ధ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసారు. ఎప్పుడు బీజేపీపై ప్రశ్నల వర్షం, మండిపడే కేటీఆర్ థ్యాంక్స్ చెప్పడమేంటని చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ ప్రధానికి థ్యాంక్స్ అంటూ సెటైర్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ . అయితే.. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్ వేసారు. అంతేకాకుండా.. దేశాన్ని…
హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా.. హర్ ఘర్ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ…
కేంద్రంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దక్షిణ భారత దేశంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. నల్లగొండ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.23వేల కోట్ల నిధులు కేంద్రం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర విధానాలు దేశమగ్రతకు మంచిది కాదని.. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బ్రాహ్మండంగా…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ…