కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ట్రైన్ తెలంగాణలోనూ పరుగులు పెట్టనుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఈ వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అయితే.. తాజాగా తెలంగాణకు సైతం ఓ వందే భారత్ ట్రైన్‌ను కేటాయించింది సౌత్ సెంట్రల్ రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు. అయితే.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై పరిశీలన చేస్తోంది రైల్వేబోర్డు. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ వందేభారత్ రైళ్లలో బెర్తులు ఉండకపోవడంతో.. ఎక్కువ దూరం ప్రయాణం కాకుండా ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిసేలా దీని రూటును ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోపే చేరే గమ్యస్థానాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read : Most Polluted Cities: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కాలుష్య నగరాలు ఇవే.. టాప్‌లో వైజాగ్..
అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరు, ముంబాయి వంటి నగరాలకు ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలో.. సికింద్రాబాద్ నుంచి ఈ మార్గాల్ని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖ వైపు ప్రతిరోజు పదికి పైనే రైళ్లు అందుబాటులో ఉన్నా.. అంత ఈజీగా రిజర్వేషన్ దొరకకపోవడం నిదర్శనం. అయితే.. ఇక తిరుపతి వెళ్లే వారైతే.. నెల రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందు గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో వారు బస్సులవైపే ఆసక్తి చూపుతున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తయారయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. ఇప్పటివరకు నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగుల పెడుతున్నాయి. సెప్టెంబరు 29న గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.