భారత స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.. అహింసా విధానంతోనే కాదు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి.. దాని కోసం ప్రత్యేకంగా శ్రీకారం చుట్టి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్.. మహాత్మాగాంధీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని.. పోరుబాట కూడా అవసరం అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన.. దాని కోసం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆజాద్ హిందూ…
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలోని తమ నివాసంలో చిన్నారులతో కలిసి రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. ఈ చిన్నారులు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు, గుమస్తాలు, తోటమాలి, డ్రైవర్లు మొదలైన వారి కుమార్తెలు కావడంతో ఈ రక్షాబంధన్ ప్రత్యేకతను చోటుచేసుకుంది.
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని…