ఈ నెల 11న ప్రధాని మోడీ ఏపీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే నేపథ్యంలో తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. మోడీ విశాఖ పర్యటనలో భారీ స్వాగతం, రోడ్ షో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 11వ తేదీన 6.25 నిముషాలకు పీఎం నగరానికి వస్తారన్నారు. రెండు మార్గాలను పీఎం రోడ్ షో కోసం పరిశీలించమని కేంద్ర నాయకత్వం అనుమతి కోసం పంపించామని, 12వ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుందని, అందులో బీజేపీ పాల్గొంటుందన్నారు. రైల్వేజోన్ సహా 10 ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన చేస్తారు.. మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు… విశాఖ అభివృద్ధికి మొదటి నుంచి మోదీ సానుకూలంగా వున్నారు. రైస్ మాఫియాకు వైసీపీ నాయకులు కొమ్ముకాస్తున్నారు. పీఎం సభను హైజాక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే మాటకు కట్టుబడ్డా…. అమరావతి ఒక్కటే రాజదాని అనేది బీజేపీ నిర్ణయం…మూడు రాజధానులు అంటున్న జగన్ ను., మంత్రులను నిలదీయాలి’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
Also Read : Delhi liquor scam: లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా..
అయితే.. ఇదిలా ఉంటే.. మోడీ పర్యటన, బహిరంగ సభ కోసం విస్త్రతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ గ్రౌండ్స్ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. బహిరంగ సభకు రెండు లక్షల మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ పర్యటనలో 10వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. 11న సాయంత్రం 6.25 నిముషాలకు విశాఖకు మోదీ.. చేరుకుంటారు. ప్రధానికి అఖండ స్వాగతం పలికేందుకు రోడ్ షో నిర్వహించనుంది బీజేపీ.. ఆర్కే బీచ్, కాంచరపాలెం బీ.ఆర్.టీ.ఎస్. రోడ్లను పరిశీలించి కేంద్రం అనుమతికి పంపించింది రాష్ట్ర నాయకత్వం…. ప్రధాని సభ కోసం మూడు వేల బస్సులు కేటాయించనుంది ప్రజా రవాణా విభాగం.. ప్రధాని పర్యటనకు ఐదు వేల మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.. మరికొద్ది గంటల్లో విశాఖకు ఎస్పీజీ బృందం రానుంది.