ప్రధాని పర్యటన కోసం విశాఖలో కట్టుదట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. నిరసనలు, ధర్నాలపై నిషేధం విధించారు. ప్రధాని, సీఎం, ఇతర ముఖ్యులు రాకపోకలు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. 11, 12తేదీల్లో జరిగే రెండు కిలోమీటర్ల శోభాయాత్ర, భారీ బహిరంగ సభ నిర్వహణ విధుల్లో 6,700మంది నిమగ్నమయ్యారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సీపీ పర్యవేక్షిస్తున్నారు. భావోద్వేగ అంశాలతో నిరసనలతో ప్రధాని పర్యటనకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు సీపీ శ్రీకాంత్. పీఎం టూర్ భద్రత ఏర్పాట్లు పై విశాఖ సీపీ శ్రీకాంత్ పరిశీలించారు. అయితే.. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read : Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ
అందులో భాగంగా ఆర్కే బీచ్ లో వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, సీఎం జగన్మోహన్ రెడ్డి శిల్పాన్ని ఏర్పాటు చేశారు. వెల్కం టు వైజాగ్ క్యాపిటల్ పేరిట ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పం ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రధాని సీఎం జగన్మోహన్ రెడ్డి ల పర్యటన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా మారుతుందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.
Also Read : Hit-2 Urike Urike Full Song: ‘హిట్ 2’ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘ఉరికే ఉరికే’
ఈనెల 12న జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ కోసం విస్త్రతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం ఇప్పటికే సభా వేదిక నిర్మాణం పూర్తయింది. పీఎం,సీఎం భారీ కటౌట్లు., స్వాగత ద్వారాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మూడు లక్షల మంది ప్రజలు సభకు వస్తారని అంచనా. సభా వేదిక దగ్గర 70వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు జరిగాయి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా ల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.