పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రదాని మోడీ. ఎరువుల కర్మగారని జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన వేదిక పైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే.. ప్రధానికి తులసి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు లాభము కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘గత ప్రభుత్వాలు హయాంలో కేంద్రం 3750 కోట్లు ఖర్చు పెట్టేది బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో 26 వేల కోట్ల ఖర్చు పెడుతుంది. ధాన్యం కేంద్ర కొనలేదని ఎలా అంటారు.
Also Read : MLC Kavita : ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్
ధాన్యం కొనుగోలు ఎఫ్ సి ఐ ద్వారా లక్షల టన్నుల కొంటుంది. 2268 కోట్లతో మూడు జాతీయ రహదారులు విస్తరణ పనులుకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం లో దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లంట్ మోడీ ప్రారంభించారు. సింగరేణి ని ఎవరు ప్రవేటు పరం చేస్తారు. సింగరేణి ప్రవేటు పరం ఆలోచన బీజేపీ కి లేదు. రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో తెలంగాణ లో అన్ని గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. మాకు రాజకీయ అవసరం లేదు. మేము అభివృద్ధి కోసం పని చేస్తాము. రాజకీయం వేరేలా చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఎరువుల కర్మాగారం, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌లకు సంబంధించిన వీడయో ప్రజంటేషన్‌ను ప్రదర్శించారు.