పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. ఎరువుల కర్మగారాన్ని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన వేదిక పైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే.. ప్రధానికి తులసి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అలాంటి వాళ్ళని వెతికి వెతికి పట్టుకుంటామన్నారు. తెలంగాణలో రోజుకో రంగు మారుతున్న ప్రభుత్వం ఉందన్నారు. సింగరేణి ప్రైవేటు అంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వందే కదా అని ఆయన అన్నారు. 49 శాతం ఉన్న మాది.. ఎలా చేస్తామని ప్రధాని మోడీ స్పందించారు.
Also Read : Kishan Reddy : మోడీ వ్యవసాయానికి పెద్దపీట వేశారు
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చేయదని, ఆ ఆలోచన కూడా లేదని ఆయన వెల్లడించారు. ఈ సభకు వచ్చిన జన సమూహంతో హైదరాబాద్ లో కొందరికి నిద్ర పట్టదంటూ టీఆర్‌ఎస్ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. అంతేకాకుండా.. ఎరువుల కర్మగారం గురించి మాట్లాడుతూ.. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని మోడీ అన్నారు. కానీ ఇప్పుడు రామగుండం, గోరఖ్‌పూర్‌లతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు ఎదురుకావద్దనే.. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రైతులకు ఇబ్బందులకు కలిగించే ఎలాంటి నిర్ణయాలకు బీజేపీ అంగీకారం తెలుపదన్నారు.