ఏపీలో మోడీ రెండురోజుల పర్యటన ముగిసింది. మోడీ తన పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ భేటీ అయ్యారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు. ఏపీ బీజేపీ నేతలకు ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే షెడ్యూల్ మార్చి ముందుగా బీజేపీ నేతలతో భేటీ అయ్యారు ప్రధాని మోడీ. కేంద్ర నిధుల పక్కదారి పడుతున్నాయన్న అంశం పైనే సుదీర్ఘంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల జాబితాను చదివి వివిపించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. సుమారు రెండు గంటలు ప్రధానితో కోర్ కమిటీ సభ్యుల భేటీ జరిగింది.ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలని ప్రధాని సూచించారు. పార్టీని ఏవిధంగా విస్తరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోడీ చెప్పారు. పీఎం మోడీ తన ఆలోచనలు కోర్ కమిటీతో పంచుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై కోర్ కమిటీలో ప్రధాని చర్చించారని ఆయన తెలిపారు.
Read Also: Mobile tower stolen: ఈ దొంగలు మామూలోళ్లు కాదండోయ్.. సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు..
కేంద్ర నిధుల దుర్వినియోగం గత ప్రభుత్వంలో కూడా జరిగిందన్నారు పలువురు నేతలు. ఏపీలో రాజకీయ పరిస్థితుల పైనా ప్రధాని ఆరా తీశారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రధాని రెండు రోజుల పర్యటన సక్సెస్ అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను సక్సెస్ చేసేందుకు కృషి చేసింది. ప్రధాని సభను సక్సెస్ చేసినందుకు సీఎం జగనుకు ధన్యవాదాలు. పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రధానితో అనుబంధం ఉందన్న సూఎం కామెంట్లను ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. ప్రధాని-సీఎంల మధ్యం బంధం పార్టీలకు.. రాజకీయాలకు అతీతంగానే ఉంటుంది. ప్రధాని రెండు రోజుల పర్యటన రాష్ట్రానికి.. బీజేపీకి ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ భవన నిర్మాణ శంకుస్థాపన అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తారని ప్రజలంతా భావించిన మాట వాస్తవమే అని విష్ణుకుమార్ రాజు ఒప్పుకున్నారు. రైల్వే జోన్ పై నిర్ణయం జరిగిపోయింది.. కొత్తగా చెప్పాల్సింది కూడా ఏం లేదన్నారు.
Read Also: Eating Rules: భోజనం చేసేప్పుడు ఇది ఫాలో అవ్వండి అనారోగ్యాలు రావు..