మోడీ విశాఖ పర్యటన నగర వాసుల్లోనే కాదు ఏపీ ప్రజల్లోనూ ఆసక్తిని పెంచింది. ఆంధ్ర యూనివర్శిటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా ప్రజలు హజరైయ్యారు. ఈ వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు తీరని నిరాశే మిగిలింది. విశాఖ పర్యటనలో మోడీ ప్రసంగం చప్పగా సాగింది. ఎలాంటి హామీలు, వాగ్దానాలు లేవు. ఏపీకి ఏదో జరుగుతుందని భావించిన వారికి చివరాఖరికి నిరాశే కలిగింది. విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావించినా.. అలాంటిదేం లేకుండా పోయింది. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావించారు.. 106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి లభిస్తుందని భావించినా, వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ మాత్రం రాలేదు. మోడీ బహిరంగ సభ, ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి పెట్టుకున్న ప్రజలు నిరాశతో వెనుతిరిగారు.
మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రియమైన సోదరీ, సోదరులారా.. నమస్కారం.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి, అందరు మహానుభావులకు, ఏపీ ప్రజలకు అభినందనలు.. కొన్ని నెలల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలకు రావడం ఎంతో ఆనందం, భాగ్యం కలిగింది. ఇటువంటి మరో అవకాశం వచ్చింది. విశాఖపట్టణం దేశంలో ప్రముఖ నగరం. ప్రత్యేక నగరం. వ్యాపారం సమృద్ధిగా సాగే పట్టణం.. ప్రాచీన భారతంలో మంచి పోర్టు. 1000 ఏళ్ళ క్రితం వరకూ పశ్చిమాసియా రోమ్ నుంచి ఇక్కడికి వ్యాపారులు వచ్చేవారు. భారత వ్యాపార కేంద్రానికి విశాఖ కేంద్రం.
భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోదీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులు వేస్తోంది. 10వేల పథకాల వల్ల అభివృద్ధికి బాటలు పడతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకత వుందన్నారు మోడీ.
Read Also: Revanth Reddy: మోడీకి రేవంత్ ఓపెన్ లెటర్.. ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్
ప్రపంచంలో అనేక దేశాల్లో ఏపీ వారు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. జీఎస్టీ, గతి శక్తి వంటి పాలసీల వల్ల పేదల సంక్షేమం కలుగుతోంది. భారత్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయి. అభివృద్ది యొక్క ప్రయాణంలో అనేక జిల్లాలు, వెనుకబడిన చోట కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో 6 వేలు వేస్తున్నాం. పేదలకు ఉచిత ఆహారధ్యానాలు ఇస్తున్నాం అన్నారు. డ్రోన్ల నుంచి గేమింగ్ ల వరకూ, అంతరిక్షం నుంచి స్టార్టప్ ల వరకూ అనేక పథకాలు మీ కోసం పనిచేస్తున్నాయి. యువతకు ఉపాధి లభిస్తోంది.
విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల్లో ఏపీకి చెందినవారు ఎంతో దూసుకుపోతున్నారు. ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. వృత్తి పరమయిన , ఉల్లాసవంతమయిన, ఉత్తమ వ్యక్తితం వారిని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. తెలుగు భాష ఎంతో ఉన్నతమయింది. తెలుగు ప్రజలు అందరి బాగు కోసం వెతుకుతుంటారు. ఈ పథకాలు అభివృద్దికి దోహదపడతాయి. ప్రపంచంలో శ్రేష్టమయిన మౌలిక సదుపాయాల నిర్మాణం వుంది. మౌలిక సదుపాయాల కల్పనలో మా దార్శనికత కనిపిస్తోంది. రైల్వేల అభివృద్ది, రోడ్లు, పోర్టుల విషయంలో సందేహపడలేదు. మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం దేశానికి నష్టం కలిగించింది. ఎకనామిక్ కారిడార్ గురించి ఆలోచిస్తున్నాం. పోర్టుకి వెళ్లడానికి రహదారి నిర్మాణం వుంది. చేపల రేవు ఆధునీకరిస్తున్నాం.అనేక ప్రాజెక్టులపై ఖర్చు తగ్గుతుంది. రవాణా వ్యవస్థలో మార్సులు వచ్చాయి. బహుముఖ రవాణా వ్యవస్థ భవిష్యత్. మీరు ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ ఆకాంక్షలు మాకు తెలుసు. భారత్ అనేక సవాళ్లను అధిగమించింది. భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసలు పొందుతోంది. ప్రపంచ ఆశల యొక్క కేంద్రబిందువుగా మారింది. భారత్ పౌరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటోంది. సామాన్య మానవుడి జీవితాన్ని మారుస్తుంది.
అంతకుముందు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు విశాఖలోని ఆంధ్ర యూనివర్శటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికపైకి చేరుకున్న ప్రధానిని ముఖ్యమంత్రి జగన్ శాలువాతో సత్కరించారు.
Read Also:Gujarat Assembly Elections: స్పీడ్ పెంచిన బీజేపీ.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల