అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు నేడు( ఆదివారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన కేంంద్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.24.50 కోట్లు విడుదల చేసింది.
Sisters of PM Modi, CM Yogi meet at Uttarakhand Temple: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరీమణులు ఉత్తరాఖండ్లో కలుసుకున్నారు. ప్రధాని మోదీ సోదరి వాసంతీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవిలు కొఠారీలోని ఓ దేవాలయం సమీపంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రావణ మాసం సందర్భంగా శివుని దర్శనం కోసం…
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మరోసారి వేడెక్కనుంది. ఈ ప్రతిపాదనపై ఆగస్టు 8 నుంచి చర్చలు ప్రారంభమవుతాయని, ఇది మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 10 వరకు ఉంటుందని సమాచారం. విశేషమేమిటంటే.. చర్చల చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటులో సమాధానం చెప్పబోతున్నారు.
India Per Capita Income: 2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం దాదాపు 70 శాతం పెరుగుతుందని అంచనా. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పరిశోధన నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ఇప్పుడు 2,450డాలర్లకి చేరుకుంటుందని.. 2030 నాటికి 4,000డాలర్లకి చేరుతుందని అంచనా.
సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు కేంద్రం 50 శాతం ఆర్థిక సాయం చేయనుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
రాజస్థాన్ ప్రభుత్వం ఆర్థిక అవక తవకలకు పాల్పడిందని మాజీ మంత్రి రాజేంద్ర గూడ రెడ్ డైరీ పేరుతో చేసిన ఆరోపణల నేపథ్యంలో .. అదే రెడ్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు.