లోక్‌సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు.
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు.
మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు అని అమెరికా సింగర్ మేరీ మిలి బెన్ అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్ సమస్యపై ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇచ్చారు.
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.