‘Bharat’ controversy: ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారుస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల పేర్లు మార్చుకోవాలని ఆ దేశాలు అనుకున్నప్పుడు యూఎన్ వాటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతలో టర్కీ పేరు ‘తుర్కియే’గా మార్చడాన్ని ఉదహరించారు. టర్కీ విషయంలో మాకు అందిన అధికారిక అభ్యర్థన మేరకు మేను స్పందించామని అన్నారు. పేరు మార్పుపై మాకు సహజంగా అలాంటి అభ్యర్థన వస్తే అవి వచ్చినట్లుగానే వారిని పరిగణిస్తామని అన్నారు. ఇండియా పేరు మార్పుపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఇండియా పేరును భారత్ గా మర్చుకోవచ్చని అన్నారు.
Read Also: TSPSC Exam Postponed: టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష మళ్ళీ వాయిదా!
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జీ20 దేశాధినేతలకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ పంపిన ఆహ్వాన ప్రతిలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’అని ఉంది. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇండోనేషయా పర్యటన నోట్ లో కూడా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’ అని ఉంది. ఈ రెండు సంఘటనలు ఇండియా పేరు భారత్ గా మారుతుందనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లును పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నందుకే కేంద్రంలోని బీజేపీ ఇలా చేస్తుందని మండిపడుతున్నారు.