భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.
MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు.
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన "పీఎం విశ్వకర్మ"కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే.. breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, pm modi, big news