డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు.
15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (ఆగస్టు 22) సాయంత్రం 5.15 గంటలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆహ్వానం మేరకు ప్రధానికి అక్కడికి వెళ్లారు.
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.