Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చుకుంటున్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్…
ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
Early Elections: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఒక్కసారి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా విపక్షాలు ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అంచనా వేస్తున్నాయి. సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.
PM Modi: ఇస్రో ప్రతిష్టాత్మకం చేపట్టిన ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ విజయవంతం అయింది. ఈ రోజు 11.50 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపబడింది. భూమి దిగువ కక్ష్యలో ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి నాలుగు నెలలు ప్రయాణించి భూమి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్1(L1)కి చేరనుంది.
G20 Summit: జీ20 సమ్మిట్ కి భారత్ సిద్ధం అయింది. ఇప్పటికే సమావేశం జరగబోతున్న ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జీ20 దేశాధినేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత హామీ ఇచ్చారని, కానీ అది ఏనాడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ యాదవ్ మండిపడ్డారు.
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు.
దాదాపు 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చి సెంటర్ చేసిన సర్వే ప్రకారం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.