గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.
కొత్తగా నియామకమైన 51,000 మంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 28న ఈ కార్యక్రమం జరగనుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.
గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్‌లోని ఏథెన్స్లో శుక్రవారం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు' లభించింది.
చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్‌లో పర్యటనలో ఉన్నారు. నిన్నటి వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ దేశాల సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ నేరుగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు బయలుదేరి వెళ్లారు.
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.