ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన బిజినెస్ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్న చోట మాత్రమే లాభదాయకమైన మార్కెట్ మనుగడ సాగిస్తుందని ప్రధాని అన్నారు. ఇతర దేశాలను మార్కెట్‌గా పరిగణించడం ఎప్పటికీ పనికిరాదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.
కొత్తగా నియామకమైన 51,000 మంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 28న ఈ కార్యక్రమం జరగనుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.