ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్కు వచ్చి వెళ్లారని.. ఐఐఎం మెడికల్ కాలేజ్లు ఉన్నత విద్యా సంస్థలు విభజన హామీలు ఏవీ అమలు చేయని పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని (HMDA) నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు.