నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ అహ్మదాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ, రిచర్డ్ మార్లెస్ స్టేడియానికి చేరుకుని మ్యాచ్ ను తిలకించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు.
Read Also: Santosham OTT Awards 2023:గ్రాండ్ గా ‘సంతోషం’ ఓటీటీ అవార్డ్స్.. విన్నర్స్ వీరే!
మరోవైపు.. ఈ మ్యాచ్ లో విజేతకు ప్రధాని మోదీ వరల్డ్ కప్ ను బహూకరించనున్నారు. కాగా, ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో లక్ష్యచేధనకు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా కూడా ఇబ్బందుల్లో పడింది. భారత్ బౌలర్ల దాటికి ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టారు.
Australian Deputy PM & Defence Minister Richard Marles arrived at Ahmedabad Airport; received by Gujarat CM Bhupendra Patel #ICCWorldCup2023 #INDvAUSFinal pic.twitter.com/SI6bSz0uJ5
— ANI (@ANI) November 19, 2023