గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని తేల్చిచెప్పారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిన జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రం బడ్జెట్‌పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.
మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సానుకూలంగా ఉందని నితీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. దీనిని అందరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాల వల్ల పారిశ్రామిక రంగాన్ని శరవేగంగా అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. అలాగే దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని నితీష్‌కుమార్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే నిర్మలమ్మ బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌తో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. అయినా బడ్జెట్ ప్రసంగమంతా పొగడ్తలకే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి:CM Revanth Reddy : మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ఈ బడ్జెట్లోనే వాటికి నిధుల కేటాయింపు