పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) నాడు లోక్‌సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశ పెట్టబోతుంది. ఈ ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షల సమయంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. దోషులుగా తేలిన వారికి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో కూడిన జరిమానాలు అన్ని బిల్లులో ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్ యోచిస్తోంది.
Read Also: Paytm: ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుంది..
అయితే, రాజస్థాన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, హర్యానాలో గ్రూప్-డీ పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ పరీక్ష, బీహార్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, తెలగాణలో గ్రూప్- 1 పరీక్ష (టీఎస్పీఎస్సీ) గత ఏడాది ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఇక, బడ్జెట్ సమావేశాలలోనే పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం పార్లమెంట్ లో ప్రస్తావించారు.