Congress: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు కాంగ్రెస్ వెళ్తుందా..? లేదా..? అనే సందేహాలకు తెరపడింది. ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రామ మందిర వేడుక పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమంగా ఉందని ఆరోపించింది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది.
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగింది. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. ఇటీవల ప్రధాని లక్షద్వీప్ వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద పోస్టులను పెట్టారు. దీంతో చాలా మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ యాత్రల్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్తో పాటు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
PM Modi: గుజరాత్ గాంధీనగర్లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు సోము వీర్రాజు
ఇవాళ్టి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు రెడీ అయింది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్ను విడిచిపెట్టింది పాకిస్థాన్.
ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
PM Modi: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు.