500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.
శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో..…
Ram Mandir : 500ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు తన కొత్త, గొప్ప రాజభవనంలో నివసించబోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, సంత్ సమాజ్, వీవీఐపీల సమక్షంలో రాంలాలా శ్రీవిగ్రహానికి సంబంధించిన చారిత్రాత్మక ఆచారం జరగనుంది.
Swami Avimukteshwaranand: రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. హిందువులను జాగృతం చేయడం చిన్న విషయం కాదని, అది ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇతనే కొన్ని రోజుల క్రితం రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
Wed in India: విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్పై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ సంపద దేశంలోనే ఉండేలా ‘వెడ్ ఇన్ ఇండియా’ని ప్రోత్సహించాని ప్రజల్ని ఆయన కోరారు. గుజరాత్లోని అమ్రేలి నగరంలో ఖోడల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వాస్తవంగా ప్రసంగించిన ప్రధాని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Mary Millben: యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు రేపు జరగబోయే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అయోధ్యంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు, సాధువులు 7000 మంది వరకు హాజరవుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు అయోధ్య చేరుకుంటున్నారు.
PM Modi Full Schedule For Ram Mandir Inauguration on 2024 January 22: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 22) అయోధ్యకు…