Rahul Gandhi: ప్రధాని మోడీ ఓబీసీ కులంలో పుట్టలేదని.. ఆయన తన కులం గురించి అబద్ధాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన కులం గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ప్రధానమంత్రి జనరల్ కేటగిరీ వర్గానికి చెందినవారని, ఇతర వెనుకబడిన వర్గానికి (OBC) కాదని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలోని ఝార్సుగూడలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ ఓబీసీ కేటగిరీలో పుట్టలేదు.. గుజరాత్‌లోని తెలీ కులంలో జన్మించారని ఆరోపించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’ను దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోడీ
2000 సంవత్సరంలో ఈ వర్గానికి ఓబీసీ అనే ట్యాగ్‌ను బీజేపీ ఇచ్చిందన్నారు. ఆయన జనరల్ కేటగిరీలో పుట్టాడని రాహుల్ ఆరోపణలు చేశారు. తాను ఓబీసీలో పుట్టలేదని కాబట్టే మోడీ కులగణన చేయటం లేదన్నారు. మోడీ తన కులం గురించి ఎప్పుడూ అబద్దాలే చెబుతారని.. పుట్టింది తెలీ కులంలో అని కొత్తగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
పొరుగున ఉన్న ఒడిశా నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది.నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో తన పార్టీని అధికారం నుంచి తొలగించిన తర్వాత రాహుల్ గాంధీకి ఇది మొదటి పర్యటన. జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర ఫిబ్రవరి 11న రాయ్‌గఢ్, శక్తి, కోర్బా జిల్లాల మీదుగా సాగనుంది. ఫిబ్రవరి 14న బలరాంపూర్ నుంచి యాత్ర జార్ఖండ్‌కు వెళ్లనుంది.