CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తినలో హీట్ పెంచుతున్నాయి.. నిన్నటి నిన్న ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు జరిపారు.. ఈ రోజు ఉదయం ఆయన హస్తిన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.. ఇక, ఏపీలో ఎన్నికల పొత్తులు హీటు పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ, టీడీపీ-జనసేన మధ్య పొత్తులు ఉండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే వెళ్లే విధంగా నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు ముగియగా.. ఇక, ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!