ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజలు పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేడు రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని బండకేసి కొడితే…
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల తర్వాత, నగదు కొరతతో ఉన్న దేశం పగ్గాలను రెండవసారి స్వీకరించిన షరీఫ్ సోమవారం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ రాకతో మార్పులు చేశారు. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అబివృద్ధి కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు.
CM Revanth Reddy Speech in Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని, అభివృద్ధి విషయంలో మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధానికి సీఎం స్వాగతం…
PM Modi Says My life is dedicated to the Nation: తన జీవితం ఓ తెరచిన పుస్తకం అని, దేశం కోసమే తన జీవితం అంకితం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం వచ్చానన్నారు. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడమే తన లక్ష్యం అని ప్రధాని మోడీ చెప్పారు. సోమవారం ఆదిలాబాద్‌లో కోట్ల విలువైన…
PM Modi Speech in Adilabad: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం అని అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి…